గుంటూరు జిల్లా మాచర్లలో బుధవారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలపై బుధవారం జరిగిన దాడిపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని గుంటూరు ఐజీని ఆయన ఆదేశించారు. మరోవైపు జిల్లా ఎస్పీ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అలాగే డీజీపీ ఆదేశాలతో గుంటూరు ఐజీ.. మాచర్లకు బయల్దేరారు.ఎవరు దాడి చేశారో తెలియదు...
కాగా, మాచర్లలో ఎవరు ఎవరిపై దాడి చేశారో తెలియదని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. ఈ ఘటనపై వాస్తవాలు విచారణలో తెలుస్తాయని చెప్పారు. మాచర్లలో ప్రజలను రెచ్చగొట్టేందుకే బొండా ఉమా, బుద్దా వెంకన్న అక్కడకు వెళ్లారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఏదో ఒక అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో టీడీపీ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.
కాగా, టీడీపీ కార్యకర్తల్ని కలిసేందుకు వెళ్లిన టీడీపీ సీనియర్ నేత బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్లపై బుధవారం ఉదయం దాడి చేశారు. కార్లను అడ్డగించి.. వైఎస్సార్‌సీపీ వర్గీయులు కర్రలతో అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో మాచర్లలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది
మాచర్ల దాడిపై డీజీపీ సీరియస్.. కీలక ఆదేశాలు
• BANDARU APPALANAIDU